నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 2 : తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగ తా సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రుల ఫొటోలతో కూడిన మాస్క్‌లు ధరించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌లో కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ తీశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ముఖాలకు సీఎం రేవంత్, మంత్రుల చిత్రపటాల మాస్క్‌లను ధరించి ర్యాలీ చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో దీక్షా శిబిరం నుంచి నేతాజీ చౌక్‌లోని అమరవీరుల స్తూపం వర కు పాదయాత్ర నిర్వహించారు.
గద్వాలలో వంటావార్పు, నాగర్‌కర్నూల్‌లో మానవహారం నిర్మించారు. కామారెడ్డిలో ఉద్యోగులు తాళ్లతో చేతులు కట్టేసుకుని నిరసన తెలిపారు. వికారాబాద్‌లో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి బీజేఆర్ చౌరస్తా వద్ద సీఎం, మంత్రుల మాస్కులను ధరించి నిరసన తెలిపారు. హనుమకొండలో శివుడు, రుద్రమదేవి, పోతరాజు, గణపతిదేవుడు, భరతమాత, సమ్మక్క-సారలమ్మ వేషధారణతో ఉద్యోగులు మహా ర్యాలీ నిర్వహించారు. అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. ఖమ్మంలో సీఎం, మంత్రుల మాస్క్‌లు ధరించి పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాల యం ఎదుట సమ్మె శిబిరంలో గురువారం సీఆర్టీ ఉపాధ్యాయురాలు పద్మ (మామడ కేజీబీవీ) సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను దవాఖానకు తరలించారు. 24 రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో పద్మ ఆరోగ్యం క్షీణిం చిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.