హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ) : తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సీరియస్గా పరిగణించింది. ఈ మేరకు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి రీల్స్, ఫొటో షూట్ చేస్తూ తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నది.
శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది.