మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 26: బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో చేపట్టిన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ఎదుట ఉన్న శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. 2,087 ఎకరాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అతిపెద్ద పార్కుగా గుర్తింపు తీసుకొచ్చారు. శ్రీనివాస్‌గౌడ్ మంత్రిగా ఉన్న సమయం లో జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వైపు హైవే వెంట ఏర్పాటు చేసిన లైట్ల ప్రారంభోత్సవంలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని పార్కు వద్ద ఆవిష్కరించారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ధ్వంసం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.