జోగుళాంబ గద్వాల : నకిలీ విత్తనాలను కట్టబెట్టి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి విన్నవించారు. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని మానవపాడు మన గ్రోమోర్ షాప్‌లో కొంతమంది రైతులు కావేరి జాదు బూజీ -2 పత్తి విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు.
అయితే 75 రోజుల తర్వాత పూత, పిందె, కాయలు రాలిపోతుండటంతో ఆందోళన చెందిన రైతులు నకిలీ విత్తనాలు అంటగట్టారని ఆరోపిస్తూ రైతులు కృష్ణ, పరమేష్, శంకరన్న, జగన్ మోహన్ రెడ్డి తదితరులుహైదరాబాద్లో మంత్రికి వినతిపత్రం అందించారు.
కాగా, విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్ రైతులకు హామీనిచ్చారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, సంబంధిత వ్యవసాయ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేసి మూడు రోజులలో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.