వెంకటాపురం(నూగూరు) ఏప్రిల్ 5 : మక్కజొన్న రైతులకు పరిహారం చెల్లించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శనివారం ములు గు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండ లం బర్లగూడెం పంచాయతీ పరిధి చిరుతపల్లిలో అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్జాదవ్తో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకొన్న కొన్ని కంపెనీల యజమానులు నకిలీ విత్తనాలు సరఫరా చేసి నష్టపర్చాయన్నారు.