హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మహ్మద్సర్వర్ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. తన తండ్రి మహ్మద్సర్వర్కు క్షమాభిక్ష ప్రసాదించే అంశంలో గతంలో ఇచ్చి న ఉత్తర్వులు అమలు కాలేదంటూ ఆయన కుమారుడు మహ్మద్సర్ఫరాజ్ కోర్టుధికార కేసు దాఖ లు చేశారు.
జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపి ఇటీవల తీర్పు చెప్పారు. గవర్నర్‌కు పంపిన ఫైల్‌పై తదుపరి చర్యలు తీసుకునేలా అధికారులు ప్రయ త్నించాలని సూచించారు. తన తండ్రి ఏపీ వక్ఫ్‌బోర్డు కార్యదర్శిని అధికారిక విధుల్లో హత్య చేయలేదని, సబార్డినేట్ సర్వీస్‌రూల్స్ వర్తించవని, కాబ ట్టి క్షమాభిక్ష ప్రసాదించాలని వాదించారు.