హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 నుంచి 42 శాతానికి పెంచడంపై గతంలో విధించిన స్టేను హైకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు జీవోలు 9, 41, 42పై స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతోపాటు ఆ రిజర్వేషన్లను సమర్థిస్తూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.