స్టేషన్ ఘన్పూర్ : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వరంగల్ జిల్లా నర్సంపేట వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను స్టేషన్ మార్గ మధ్యలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌కు కార్యకర్తలతో చేరుకొని, స్టేషన్ ఎదురుగా బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, వారి మరణానికి కారణమైందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారి అపాయింట్మెంట్ డేటును ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మార్గ మధ్యలో అరెస్ట్ చేసి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు https://t.co/WWhryf9hXe pic.twitter.com/7RogIizW2M
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2026