ఖైరతాబాద్, మే 27: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ప్రకటించాలని, లేదంటే జూన్ 10 తర్వాత రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుడుతామని, తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లా డుతూ బీసీలకు 23 నుంచి 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల ముందే హామీ ఇచ్చిందని, కులగణన చేస్తే ఆ సంఖ్య 52 శాతానికి పెరుగుతుందని, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతానికి పెంచడంతో మొత్తంగా ఆయా కులాలకు 82 నుంచి 84శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం ఏర్పడి ఐదు నెలలు దాటుతున్నా రిజర్వేషన్లపై ఎందు కు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయా ంలో 30 వేల పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహిస్తే, వాటిని భర్తీ చేసి ఆ క్రెడిట్‌ను మీ ఖాతాలో వేసుకుంటారా? అని రేవంత్‌ని మందకృష్ణ ప్రశ్నించారు.