హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్-2025)కు మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చాయని టీజీ టెట్ చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్-1కు 63,261, పేపర్-2కు 1,20,392 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.
అభ్యర్థులు ఈనెల 3 వరకు వివరాలను సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. https: schooledu. telangana.gov.in వెబ్సైట్లో వివరాలు సవరించుకోవచ్చని స్పష్టంచేశారు. ఆన్లైన్ పరీక్షను జూన్ 15, 30న నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి షెడ్యూల్ తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.