హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణవాసులే కాకుండా, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(టీఏఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భారతీయ కాన్సులేట్ జనరల్ కౌన్సిలర్ సుమతిరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలమని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా అధ్యక్షుడు మురళి బండారు పాల్గొన్నారు.