హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ-హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. హైదరాబాద్‌తోపాటు దేశ, విదేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని స్టేట్‌స్ట్రీట్ కంపెనీ ప్రతినిధుల బృందం ఆదివారం టీ-హబ్‌ను సందర్శించింది.
కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తూ వివిధ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని టీ-హబ్ నిర్వాహకులు తెలిపారు. స్టేట్‌స్ట్రీట్ కంపెనీ ప్రతినిధుల బృందం టీ హబ్‌లోని స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను పరిశీలించి, పలు అంశాలపై చర్చించిందని, ఇక్కడి స్టార్టప్‌లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిందని పేర్కొన్నారు.