హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల (Private Schools) యాజమాన్యాల ఆలోచనలు మారుతున్నాయి. పలు యాజమాన్యాలు స్టేట్బోర్డుకు గుడ్‌బై చెబుతున్నాయి. సీబీఎస్ఈకి జై (CBSE) కొడుతున్నాయి. స్టేట్ బోర్డు గుర్తింపు పొందిన స్కూళ్లు ఇప్పుడు సీబీఎస్ఈకి మారుతున్నాయి. ఈ ఐదేండ్ల కాలంలో 113 స్కూళ్లు స్టేట్‌బోర్డ్ నుంచి సీబీఎస్ఈకి మారాయి. ఏడాదికి సగటున 20 స్కూళ్లు సీబీఎస్ఈకి మారుతుండటం గమనార్హం. ఈ బడుల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఉంటున్నది. పలు టాప్ స్కూళ్లల్లో అయితే అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు తంటాలు తప్పడంలేదు. లక్కీ డ్రాలు, పైస్థాయి పైరవీలు చేయనిదే సీట్లు దొరకడంలేదు. సీబీఎస్ఈకి మారిన స్కూళ్లన్నీ తొలుత స్టేట్‌బోర్డు అనుమతి తీసుకున్నవే. మన దగ్గర అఫిలియేషన్ తీసుకుని, కొన్నేండ్లకు సీబీఎస్ఈకి మారుతున్నాయి.
ఇదీ పరిస్థితి..