వేల్పూర్, మార్చి 8: దేశంలో మోదీ అవినీతి పాలనను కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తా లేక వారి కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడీ నోటీసుల పేరిట వేధిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది నీచాతి నీచమైన రాజకీయ కుట్ర, యావత్ దేశ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న కేసీఆర్‌పై మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఇవన్నీ అన్నారు.
కేసీఆర్ బిడ్డను ఇబ్బంది పాలు చేసి కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బ తీయాలనే దురాలోచన అని మండిపడ్డారు. మోదీ ఎన్ని కు ట్రలు చేసినా కేసీఆర్ తలొగ్గరని, ఇలాంటి ఊకదంపుడు బెదిరింపులకు భయపెడితే తెలంగాణ రాష్ట్రం సాధించే వాడే కాదని స్పష్టం చేశారు. మేమంతా కేసీఆర్ కుటుంబసభ్యులమేనని, ఎన్ని కేసులు పెడుతారో పెట్టుకోండని అన్నా రు. ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న మోదీకి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.