బీఆర్ఎస్ వైపే గౌడ కులస్థులు
రాష్ట్రంలోని 32 లక్షల మంది గౌడ కులస్థులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కారు గుర్తుకే ఓటేస్తారని గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత రామంతాపూర్‌లో సోమవారం గౌడసంఘం నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
- తెలంగాణ వచ్చాకే గౌడల అభ్యున్నతి
- మళ్లీ గెలిస్తే సేఫ్టీ మోకులు, మోపెడ్లు
- గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్
రామంతాపూర్, నవంబర్ 27: రాష్ట్రంలోని 32 లక్షల మంది గౌడ కులస్థులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కారు గుర్తుకే ఓటేస్తారని గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత రామంతాపూర్‌లో సోమవారం గౌడసంఘం నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడల అభ్యున్నతికి విశేషంగా పాటుపడుతున్నదని తెలిపారు.
గౌడ వృత్తిదారులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. ప్రతి ఏటా కల్లు గీత వృత్తిదారులు చెల్లించే 20 కోట్ల రెంటల్స్ మాఫీ చేసిందని, సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, నాడు కాంగ్రెస్ సర్కారు కల్లు దుకాణాలను మూసి వేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 103 కల్లు సొసైటీలను తెరిపించిందని, 30 అడుగుల పాపన్న భారీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని వివరించారు.
హైదరాబాద్ నడిబొడ్డున నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశారని, కల్లుగీత కార్మికులకు బీమా తీసుకొచ్చారని, గౌడ కులస్థుల ఆత్మగౌరవం కోసం కోకాపేటలో భవనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఇచ్చారని, వైన్ షాపుల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించారని చెపపారు. కల్లు గీత కార్మికుల మరణాలను అరికట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీహార్ నుంచి పొట్టి తాటి మొక్కలను తెప్పించిందని, కార్మికుల సేఫ్టీ కోసం మోకులు, మోపెడ్స్ను ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తమ అభ్యున్నతికి ఇన్ని చేసిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలోని గౌడ కులస్థులకు పిలుపునిచ్చారు. ఉప్పల్‌లో ఉన్న గౌడ సోదరులు బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌడ సంఘం ప్రతినిధులు పాలకూర దాసుగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకూర శ్రీకాంత్‌గౌడ్, నేమూరి శ్రీకాంత్‌గౌడ్, నవీన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

