నిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ ల్యాబ్
క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక ‘నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్' (ఎన్జీఎస్) సాంకేతికతతో కూడిన క్యాన్సర్ జీనోమిక్స్ ల్యాబ్‌ను నిమ్స్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
- ఒకేసారి 52 జన్యుమార్పుల విశ్లేషణకు వీలు
- రోగులకు ఉచితంగా ఎన్జీఎస్ పరీక్షలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక ‘నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (ఎన్జీఎస్) సాంకేతికతతో కూడిన క్యాన్సర్ జీనోమిక్స్ ల్యాబ్‌ను నిమ్స్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఒకేసారి 52 జన్యు మార్పులను (మ్యుటేషన్లను) అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, రోగికి అనుకూలమైన చికిత్సను నిర్ణయించే అవకాశం కలుగుతుందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప వెల్లడించారు.
ఎన్జీఎస్ ప్రత్యేకతలు
- ఒకేసారి అనేక జన్యువులను విశ్లేషించే సామర్థ్యం ఉంటుంది.
- క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు మార్పుల (మ్యుటేషన్ల)ను అత్యంత కచ్చితత్వంతో వేగంగా గుర్తించవచ్చు.
- వ్యక్తిగతీకరించిన (ప్రెసిషన్ మెడిసిన్) చికిత్సను అందించే వీలుంటుంది.
- దుష్ప్రభావాలను తగ్గిస్తూ రోగికి లక్ష్యిత చికిత్స అందించవచ్చు.
- చికిత్స ఫలితాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
- లంగ్, బ్రెస్ట్, బ్రెయిన్, బ్లడ్ క్యాన్సర్లు సహా పలు రకాల క్యాన్సర్ల చికిత్సకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
భవిష్యత్తులో అన్ని రకాల క్యాన్సర్ రోగులకు సేవలు
ఎన్జీఎస్కి సంబంధించిన ట్రయల్స్‌ను నెలరోజుల క్రితం ప్రారంభించి 28 మంది రోగులకు పరీక్షలు నిర్వహించామని, అవి విజయవంతమవడంతో ప్రస్తుతం ఊపిరితిత్తుల (లంగ్) క్యాన్సర్ రోగుల కోసం ప్రారంభించామని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతివీర్ తెలిపారు. భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, బ్లడ్ క్యాన్సర్లు సహా అన్ని రకాల క్యాన్సర్ రోగులకు ఈ సేవలను విస్తరిస్తామని చెప్పారు. జీనోమిక్ పరీక్షల్లో గుర్తించే మ్యూటేషన్ల ఆధారంగా ఎవరికి ఏ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఒకే రకమైన క్యాన్సర్ ఉన్న ఇద్దరు రోగుల్లో జన్యు మార్పులు భిన్నంగా ఉండే అవకాశం ఉంటుందని, అందువల్ల చికిత్స కూడా వ్యక్తిగతంగా మారుతుందని తెలిపారు.
రూ.లక్షలు ఖర్చయ్యే పరీక్షలు ఉచితం
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఎన్జీఎస్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిదని, వాటిలో తమ దవాఖాన ఒకటని, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు కలిపి ప్రారంభించిన ఈ ల్యాబ్‌లో ప్రస్తుతం నెలలో 30 మందికి ఎన్జీఎస్ పరీక్షలు నిర్వహించే వీలున్నదని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప వివరించారు. ప్రైవేటు దవాఖానల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ పరీక్షలను అర్హులైన రోగులకు నిమ్స్‌లో పూర్తి ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

