హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేలో ప్రభుత్వం బీసీల సంఖ్యను తగ్గించి చూపిందని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు సీవెళ్లి సంపత్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం కోటాతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర సర్వేలో 1.83 కోట్లు ఉన్న బీసీ జనాభా పదేండ్ల తర్వాత 1.62 కోట్లకు తగ్గిందనడం విడ్డూరమని చెప్పారు. కులగణన సర్వే నిర్వహణలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. భేషజాలకు పోకుండా రీసర్వే నిర్వహించి, లోపాలను సరిదిద్దాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.