Governor Jishnu Dev Varma | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొద్దిసేపు టీచర్‌గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నైపుణ్యాలను గవర్నర్ స్వయంగా పరీక్షించారు. చదవడం, రాయడాన్ని గమనించారు.
ఏమై నా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ధృడ సంకల్పంతో తమ కలలను సాకారం చేసుకోవాలని, సమాజం పట్ల బాధ్యతను పెంచుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. విద్యార్థుల ప్రతిభను ఈ సందర్భంగా ప్రశంసించారు. పిల్లలతో ఆయన కొద్దిసేపు సన్నిహితంగా కలిసిపోయారు.