హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖలోని వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పోలీసులకు శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన, సేవా పతకాలను ప్రకటించింది.
పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అవినీతి నిరోధక విభాగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో విశిష్ఠ సేవలు అందించిన పోలీసులకు ఈ పతకాలను అందజేయనున్నది. వీరిలో ఒకరికి శౌర్యపతకం, 17 మందికి మహోన్నత సేవా పతకాలు, 93 మందికి ఉత్తమ సేవా పతకాలు, 46 మందికి కఠిన సేవా పతకాలు లభించనున్నట్టు హోం శాఖ వెల్లడించింది.