Polytechnic | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తున్నది. ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో జరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. దశాబ్దకాలంగా ప్రైవే ట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.14,900గా ఉన్న ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ఈ ఏడాది రూ.39 వేలకు పెంచింది. గతంలో ఫీజు మొత్తాన్ని రీయింబర్స్ చేయగా, ఈ ఏడాది మాత్రం కేవలం రూ.14,900 మాత్రమే రీయింబర్స్మెంట్ ఇస్తామన్నది. దీంతో మిగిలిన రూ.24,100 మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులే భరించాల్సి వచ్చింది.
ఈ భారాన్ని మోయలేక చాలా మంది విద్యార్థులు ఈ ఏడాది పాలిటెక్నిక్‌కు దూరమయ్యారు. పైగా ఈసారి నోటిఫికేషన్ నుంచి సీట్ల కేటాయింపు వరకు అంతా గందరగోళంగా మారడంతో అడ్మిషన్లు అమాంతం తగ్గిపోయాయి. ఏకంగా 12 వేలకుపైగా సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం సీట్లల్లో కేవలం 42% మాత్రమే భర్తీ అయ్యాయి.