Srisailam Project | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం సంబంధించిన డాటాను మాత్రం ఆన్లైన్ నుంచి మాయం చేసింది.
శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో లెక్కలు కనుమరుగు చేసింది. ప్రాజెక్టుల వారీ గా నీటి నిల్వలు, వినియోగం వివరాలను ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ (ఐడీఎస్ఎస్)లో పొందుపర్చాలి. ని రుడు జూన్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు ద్వారా 200 టీఎంసీలను, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్ ద్వారా 40 టీ ఎంసీలు, మొత్తం 240 టీఎంసీలకుపైగా నీటిని మళ్లించుకున్నది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి నుంచి కనీసం 16 టీఎంసీలను కూడా వినియోగించలేదు. ఆ గణంకాలను అందుబాటులో లేకుండా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.