హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లా పరిషత్‌లకు రూ. 125.87 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.12 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఏ శరత్ శనివారం ఉత్తర్వులిచ్చారు. స్థానిక సంస్థలకు నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధికి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఈ నిధులు ఎంతగానో దోహదం చేస్తాయని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ (జనరల్) రూ.94,99,79,000
మండల పరిషత్(జనరల్) రూ.93,67,71,000
జిల్లా పరిషత్(ఎస్సీ) రూ.19,44,77,000
మండల పరిషత్(ఎస్సీ) రూ.19,17,73,000
జిల్లా పరిషత్(ఎస్టీ) రూ.11,42,94,500
మండల పరిషత్ (ఎస్టీ) రూ.11,27,05,500
మొత్తం రూ.250 కోట్లు