హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): హోంగార్డులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చూపింది. వారికి మాజీ సీఎం కేసీఆర్ రోజుకు రూ.921 వేతనం ఇస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.79 పెంచి మొత్తం రూ.1,000ని తామే పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నది. సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు మరణించినా హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని గత జనవరిలో జీవో ఇచ్చినా.. ఒక్కరికీ ఇవ్వలేదు. జీవో ప్రకారం 2016 నుంచి చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇస్తామని చెప్పింది. రెండున్నర నెలల్లో సుమారు 10 మంది చనిపోయినా ఏ ఒక్క కుటుంబానికీ రూపాయి ఇవ్వలేదు.బడ్జెట్లో హోంగార్డులకు అన్యాయం చేసిందని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.