హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కౌన్సిల్లో కనీసం 25 మంది, గరిష్ఠంగా 30 మంది సభ్యులు ఉంటారని తెలిపింది. వీరిలో సగం మందిని ప్రభుత్వం, మిగిలిన సగం మందిని సర్వీస్ అసోసియేషన్ల నుంచి నియమించినట్టు వెల్లడించింది. అధికారుల వైపు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, విద్యాశాఖల కార్యదర్శులు తదితరులు ఉంటారని పేర్కొంది.