ఇల్లంతకుంట, సెప్టెంబర్ 5: నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ పని చేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో మండలంలోని లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలు ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందించి అండగా నిలిచిందని చెప్పారు. ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.