జహీరాబాద్, మే 21 : కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదని చెప్పారు. బుధవారం సాయం త్రం జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్‌లో దుర్గాదేవి జాతరకు హరీశ్ వచ్చారు. అనంతరం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎ రువులు, విత్తనాలను ముందుగానే అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలతో పాటు జీలుగ, జనుము విత్తనాల ధరలను కూడా పెంచిందని, సీజన్‌కు విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాను నేషనల్ సీడ్ కార్పొరేషన్‌కు అప్పజెప్పినా కేంద్రం విత్తనాలు ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విత్తనాలు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కొనుగోళ్లు సరిగా సాగక రైతులు నష్టపోతున్నారని, వర్షాలకు వడ్లు తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తున్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన దాఖలాల్లేవని విమర్శించారు. తరుగు పేరిట రైతులను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. సన్నవడ్లకు బోనస్ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసిందని ఫైర్ అయ్యారు. రూ.850 కోట్ల బోనస్‌లో రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని మండిపడ్డారు. రైతుబీమా పథకానికి ఫిబ్రవరిలో చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించక పోవడంతో రైతు కుటుంబాలకు అన్యాయం జరుగుతున్నదని వాపోయారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాట నేటికీ అమలు కావడం లేదని హరీశ్ విమర్శించారు. నిరుడితో పాటు ఈ సారి జరిగిన పంట నష్టానికి సంబంధించి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో జొన్న డబ్బు చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారని, 48 రోజులైనా చెల్లించేదని ఎద్దేవాచేశారు. ఈనెల 23న జహీరాబాద్‌కు పర్యటనకు సీఎం రేవంత్ ఏముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాణిక్యం పాల్గొన్నారు.