హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) : పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా గౌరవవేతనాలు విడుదల చేయడం లేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ బ్యాంక్ అకౌంట్లో జమచేసేది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థానిక రెండు నెలల వేతనాలు విడుదల చేయగా, ఐదు నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయని జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి తెలిపారు.