ఎన్నికల నిర్వహణకు 2 లక్షల మంది
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 119 నియోజకవర్గాల పరిధిలోని 35వేల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ రోజున పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమవుతారు.
- అవసరమైనవారికంటే అధికంగా అందుబాటులో
- అత్యవసర శాఖల సిబ్బందికి మినహాయింపు
- సీఈసీకి సమాచారమిచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారులు
హైదరాబాద్, అక్టోబరు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 119 నియోజకవర్గాల పరిధిలోని 35వేల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ రోజున పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమవుతారు. నామినేషన్లు, ప్రచారం, వ్యయ పరిశీలన, ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియలో అధికారులు, సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తారు. వీరిలో కొన్ని విభాగాల వారికి శిక్షణ కూడా ప్రారంభమైంది.
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు సమాచారం అందించారు. ప్రిసైడింగ్ అధికారుల క్యాటగిరీ వరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు 1,96,312 మంది సిబ్బంది అవసరం కాగా.. అందుబాటులో 2,01,126 సిబ్బంది ఉన్నారని గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అత్యవసరంగా మరో రెండు శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉంటే పనులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎన్నికల విధి నిర్వహణ నుంచి అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, అధికారులను మినహాయించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్తు శాఖ తదితర అత్యవసర శాఖల సిబ్బందికి మినహాయింపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?


