హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 166 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో జరుగనున్న ఎన్నికల కోసం కలెక్టర్లు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని ఆదేశించారు. హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి గురువారం ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని ఎనిమిది జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల కో సం ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. టీ-పోల్ సాఫ్ట్వేర్ ద్వారా పోలింగ్స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను మ్యాప్ చేయడంపై దిశానిర్దేశం చేశారు. బ్యాలెట్ బాక్సుల నిల్వ, అవసరమైన పోలింగ్ సిబ్బంది లభ్యతను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెకింపు కేంద్రాల్లో వెబ్ కెమెరాల ఏర్పాటుపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.