హైదరాబాద్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి కృష్ణ గోయెల్ (85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె.. హైదరాబాద్ అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శనివారం ఉదయం మహాప్రస్థానంలో కృష్ణగోయెల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీజీపీ మాతృమూర్తి మృతి పట్ల బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటని ఆయన పేర్కొన్నారు.