హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): పార్టీ సమావేశంలో తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘నా అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’ అని పేర్కొన్నారు.
కాగా, మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై కేటీఆర్ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలకు కొందరు రాజకీయ రంగు పులుముతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.