హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కళాశాలల విద్య, ఐఐటీ ముంబై స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు మధ్య ఉన్న అవగాహన ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించారు. గత మూడేండ్ల నుంచి కొనసాగిన ఒప్పందం ఈ ఏడాదితో ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర సచివాలయంలోని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ ఆకాంక్ష సాయిని, ఐఐటీ ముంబై ట్యుటోరియల్ ప్రాజెక్టు నేషనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరింది.
గత మూడేండ్ల నుంచి కొనసాగిన ఒప్పందం ప్రకారం డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు ఐటీ నైపుణ్యాలు, కంప్యూటర్ సంబంధిత సాంకేతిక అం శాలలో యానిమేషన్లో శిక్షణ ఇప్పించారు. 50 ప్రభుత్వ కళాశాలలో 50 వేల మందికిపైగా విద్యార్థులను శిక్షణ పూర్తిచేసుకోగా, వీరికి సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం లో ఐఐటీ ముంబై స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు నేషనల్ కోఆర్డినేటర్ జీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.