హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదాపడింది. శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశాన్ని ఈ నెల 28కి వాయిదావేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగాల్సి ఉండగా, సమావేశంలో పాల్గొనాల్సిన ఐదుగురు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఏఐసీసీ ఓబీసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉండటంతో ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో క్యాబినెట్ సమావేశాన్ని తిరిగి సోమవారం నిర్వహించనున్నారు.