Congress Govt | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఈ బడ్జెట్లోనూ అప్పులే ముందుపడ్డాయి. ఇకపై తాము అప్పులు చేయదలుచుకోలేదని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో జనం సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి 72 గంటలు గడవక ముందే మాట మార్చారు. రాష్ట్ర బడ్జెట్లో రూ. 69,639 కోట్ల రుణ సేకరణ కోసం ప్రతిపాదించారు. ఇది గత ఏడాది కంటే దాదాపు రూ.7,527 కోట్లు ఎకువ. ఇవి ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేసే అప్పులు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపాదిత రుణాల్లో బహిరంగ మారెట్ ద్వారా రూ.64,539 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,000 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సేకరించనున్నట్టు మంత్రి భట్టి తెలిపారు.
ప్రతిపాదిత రుణాల్లో రూ.100 కోట్ల లెక్క తేడా వస్తున్నట్టు ఆర్థిక విశ్లేకులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.69,639 కోట్లుగా చూపగా.. బడ్జెట్ బ్రీఫ్ వ్యాల్యూ-6లో చూపిన గ్లాన్స్లో రూ.69,539 కోట్లు మాత్రమే లెక్కకు వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈసారి తెచ్చే రూ.69.5 వేల కోట్ల రుణాల్లో రూ.34,816 కోట్లు గతంలో తీసుకున్న అప్పులకు గాను అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుందని స్పష్టం చేస్తున్నాయి. ఇవి పోగా మిగతా సొమ్మును ఈ సంవత్సరంలో వినియోగించుకుంటామని అధికార వర్గాలు చెప్తున్నాయి. భూముల తనఖా, కార్పేరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్( ఎస్పీవీ) ద్వారా తీసుకునే అప్పులు అదనం. కానీ, అవి బడ్జెట్ లెక్కల్లోకి రావని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. అసలు అప్పు ఎంతకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. గత బడ్జెట్లో కేవలం రూ.62 కోట్ల అప్పు చేస్తామని పేర్కొన్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. చివరికి అన్నీ కలిపి రూ.1.58 లక్షల కోట్ల రుణాలు తెచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ ఏడాది లెక్క ఎక్కడికి తేలుతుందో
సంవత్సరాల వారీగా రుణం (కోట్లలో)