తెలంగాణ ఆవిష్కరణల రాజధాని
అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా అవతరించిందని సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఎన్టీయూ) వైస్‌ప్రెసిడెంట్ టిమ్ వైట్ కొనియాడారు.
- విద్యాకేంద్రంగా, పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రం
- ఉమ్మడి పరిశోధనలకు త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం
- సింగపూర్ వర్సిటీ ఎన్టీయూ వైస్ ప్రెసిడెంట్ టిమ్ వైట్
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా అవతరించిందని సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఎన్టీయూ) వైస్‌ప్రెసిడెంట్ టిమ్ వైట్ కొనియాడారు. రాష్ట్రం విద్యాకేంద్రంగా, పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఎన్టీయూ ప్రతినిధి బృందం సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిని సందర్శించింది. ఈ సందర్భంగా పలు వర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న టిమ్ వైట్.. రాష్ట్రంలో అమలవుతున్న విద్యాపరమైన సంస్కరణల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ వర్సిటీలతో త్వరలోనే విద్యాఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామని వెల్లడించారు. 3 నుంచి 5 ఏండ్ల కాల వ్యవధి గల ఈ ఒప్పందం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. షార్ట్‌టైమ్ ఇంటెన్సివ్, ట్రైనింగ్, ఫ్యాకల్టీ ట్రైనింగ్‌లలో పరస్పర సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పరిశోధనలను ప్రోత్సహించేందుకు తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక కంపెనీలు వస్తున్న నేపథ్యంలో విద్యలో సాంకేతికతను అనుసంధానించేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ఎస్కే మహమూద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

