హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ పద్మశ్రీ డాక్టర్ గోపీచంద్ మన్నం అన్నారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని జూబ్లీహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో ఆదివారం హార్ట్ టు హార్ట్ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాన్ని డాక్టర్ గోపీచంద్, జాయింట్ ఎండీ డాక్టర్ రమేశ్ గూడపాటి, ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ 16 ఏండ్ల అనుభవంలో మా దవాఖానలో ఐదు లక్షల మంది రోగులకు విజయవంతంగా చికిత్స చేశామన్నారు. 43వేల గుండె శస్త్రచికిత్సలు, 7వేల పీడియాట్రిక్ హార్ట్ సర్జరీలు చేశామని, కార్డియాక్ సర్జరీల్లో 99.8 శాతం సక్సెస్ రేటు సాధించామని వెల్లడించారు.