హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖలో సిబ్బంది కొ రత తీర్చాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా అనేక ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ భూములను పరిరక్షించలేకపోతున్నదని మండిపడ్డారు. రూ. 5లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు లేదా ఆలయ ట్రస్టులకే తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఆ ఆలయాలను తమ ఆధీనంలోనే పెట్టుకున్నదని విమర్శించారు.
హోంగార్డు కుటుంబానికి 38 లక్షల చెక్కు అందజేత
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల చెక్కును ఆర్గనైజేషన్స్ అండ్ హోంగార్డ్స్ డీజీ స్వాతిలక్రా సోమవారం అందజేశారు. ఖమ్మం యూనిట్‌కు చెందిన హోంగార్డు గంటా నరేశ్‌కుమార్ ఫిబ్రవరి 20న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయనకు యాక్సిస్ బ్యాంకులో వేతన ఖాతా ఉండటంతో పాటు మరణ బీమా సౌకర్యం కూడా ఉంది. దీంతో బాధిత బినామీకి బీమాను బ్యాంకు విడుదల చేసింది. ఈ చెక్కును సోమవారం ఏడీజీ స్వాతిలక్రా అందజేశారు.