హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): స్టాఫ్‌నర్సు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను https://mhsrb.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఆగస్టు 1వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, వచ్చే నెల 2న పరీక్ష నిర్వహించనున్నారు.