హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్ల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రా రంభించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్లతో స్థలాల ఎం పిక ప్రక్రియను పూర్తిచేసింది. ఉస్మానియా, కా కతీయ, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీ ల్లో ఒక్కోదానికి రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.140 కోట్లను ప్రభుత్వం ఇటీవలే మం జూరు చేసింది. 500 మంది విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి కల్పించాలని ప్రభు త్వం సంకల్పించింది. అన్ని వసతులతో హాస్టల్ గదులు నిర్మించి వర్సిటీకి అందిస్తుంది. అనంతరం వీటి నిర్వహణ సంబంధిత యూనివర్సిటీయే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ యూనివర్సిటీల నుంచి ఒప్పంద పత్రాలను స్వీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 140 కోట్ల వ్యయంతో 1 లక్షా 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిరిజన విద్యార్థులకు వసతి గృహాలను నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించింది. అన్ని యూనివర్సిటీల్లో జీపీఎస్ (అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా) విధానంతో స్థలాల నిర్ధారణ పూర్తి అయింది. విద్యార్థినులకు 7,500, విద్యార్థులకు 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.