ఎడ్యుకేషన్ డెస్క్, నమస్తే తెలంగాణ : కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/రైఫిల్ మ్యాన్(గ్రౌండ్ డ్యూటీ)పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 39,481 ఖాళీలు ఉన్నాయి. వీటిలో పురుషులకు 35,612, మహిళలకు 3,869పోస్టులన కేటాయించారు.
బీఎస్ఎఫ్-15,654, సీఐఎస్ఎఫ్-7,145, సీఆర్పీఎఫ్-11,541, ఎస్ఎస్బీ-819, ఐటీబీపీ-3,017, అస్సాం రైఫిల్స్-1,248, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్-35, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-22ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై పురుషులు 170, మహిళలు 157సెం.మీటర్ల ఎత్తు ఉండాలి. 2025, జనవరి 1 నాటికి 18-23ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులకు అక్టోబర్ 14 గడువు. పూర్తి వివరాలకు https:// ssc. gov.inవెబ్సైట్ను సంప్రదించాలి.