e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home Top Slides ఆసేతు హిమాచలం.. ధర్మప్రచారం

ఆసేతు హిమాచలం.. ధర్మప్రచారం

ఆసేతు హిమాచలం.. ధర్మప్రచారం
 • కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు
 • సామాన్య భక్తులకు సులభంగా దర్శనం
 • తిరుమలలో కొవిడ్‌ కట్టడికి సమర్థవంతమైన చర్యలు
 • టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకమండలి
 • ముగిసిన టీటీడీ పాలకమండలి పదవీకాలం
 • స్పెసిఫైడ్‌ అథారిటీ చేతికి టీటీడీ పగ్గాలు

హైదరాబాద్‌, జూన్‌ 23 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి పదవీకాలం బుధవారం ముగిసింది. తదుపరి పాలక మండలిని నియమించేవరకు దేవస్థాన నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. టీటీడీ ఈవో ఆధ్వర్యంలో స్పెసిఫైడ్‌ అథారిటీకి అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆధ్వర్యంలో గత రెండేండ్లలో భక్తులకు ఉపయోగపడే అనేక అభివృద్ధి, హిందూధర్మ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఆ సేతు హిమాచలం హిందూ ధర్మప్రచారమే లక్ష్యంగా పనిచేసింది. ఈ క్రమంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచటంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వర్తించింది.

ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి..

 • జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామం వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజచేశారు. 18 నెలల్లో పూర్తి చేసి ఉత్తర భారతదేశంలో గొప్ప ఆలయంగా తయారుచేసేందుకు నిర్ణయం.
 • ముంబైలో రూ.30 కోట్లతో, వారణాసిలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని పాలక మండలి తీర్మానించింది.
 • చెన్నైలోని జీఎన్‌చెట్టి రోడ్డులో రూ.3.92 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం.
 • తమిళనాడులోని ఊలందూరుపేటలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి భూమి పూజచేశారు.
 • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాల్లో ‘గుడికో గో మాత’ ప్రారంభించారు.
 • తిరుమలలో తాగునీటి సమస్య పరిష్కారానికి బాలాజీ రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయం.
 • తిరుమలలో పర్యావర రక్షణకు ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
 • సామాన్యభక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు రద్దు
 • చేశారు.
 • అలిపిరి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి భక్తిధామం నిర్మించాలని నిర్ణయం.
 • స్విమ్స్‌ను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు టీటీడీ ఆధీనంలోకి తీసుకోవాలని తీర్మానం.
 • బర్డ్‌ దవాఖానలో నూతన ఓపీ భవనంలో అదనపు ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరుచేశారు. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్న వారికోసం రూ. 5.4 కోట్లతో 50 ప్రత్యేక గదుల నిర్మాణానికి ఆమోదం.
 • టీటీడీ ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మించారు.
 • రాష్ట్రంలోని వేద పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కామన్‌ సిలబస్‌ తయారుచేసి ఒకే సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.
 • టీటీడీ ఉద్యోగులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌) అమలుచేయాలని నిర్ణయించారు.
 • శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులను విక్రయించరాదని 28-05-2020న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయం.
 • దేశవ్యాప్తంగా స్వామివారికి చెందిన 1,128 ఆస్తులకు సంబంధించిన 8088.89 ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదలచేశారు.
 • ఆక్రమణలు, ఉపయోగంలో లేనివాటిని ఉపయోగించుకొనే విషయంపై కమిటీ వేశారు.
 • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు ఆమోదం.
 • రెండు తెలుగు రాష్ర్టాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వాడల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించదలచిన 500 ఆలయాలను ఏడాదిలో పూర్తిచేసేలా తీర్మానించారు.
 • మూడు నెలల్లోపు ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్ల ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయం.
 • తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఈ అంశంపై ఇకపై వివాదాలకు తావు ఇవ్వరాదని తీర్మానం.
 • లాక్‌డౌన్‌ సమయంలో తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ, ఆహారం కోసం రూ.50 లక్షలు ఆర్థికసాయం.
 • తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజస్వామి సత్రాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణకు అప్పగించారు. ఎస్వీ ఆయుర్వేద దవాఖానను కొవిడ్‌ హాస్పిటల్‌గా మార్చారు.
 • శ్రీ పద్మావతి కొవిడ్‌ దవాఖానలో వెంటిలేటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు సమకూర్చారు.
 • కొవిడ్‌ రెండోదశ వ్యాప్తి సమయంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం బర్డ్‌ దవాఖానను కొవిడ్‌ హాస్పిటల్‌గా మార్చారు. 140 అక్సిజన్‌ బెడ్లు, 14 వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆసేతు హిమాచలం.. ధర్మప్రచారం
ఆసేతు హిమాచలం.. ధర్మప్రచారం
ఆసేతు హిమాచలం.. ధర్మప్రచారం

ట్రెండింగ్‌

Advertisement