Srisailam Reservoir | శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 81,695 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. డ్యామ్ పూర్తి స్థాయి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 92.9240 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయానికి ఇలాగే వరద కొనసాగితే ఈ నెల చివరి వరకు డ్యామ్ నిండే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. ఎగువన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు సైతం ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువ నుంచి ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో జలాశయం పది క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు 1,04,000క్యూసెక్కులు కొనసాగుతుండగా.. అవుట్ ఫ్లో 84,792 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.493 టీఎంసీలు నిల్వ ఉన్నది.