శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో (Srisailam Temple) శ్రావణమాసం నాలుగవ రోజు ఆదివారం నాగుల చవితి ( Nagula Chaviti) పూజలు శాస్త్రోకంగా నిర్వహించారు. తెల్లవారుజామునే తలస్నానాలు చేసి చలివిడిముద్ద నువ్వుల ఉండలు, వత్తిపత్తి వస్త్రమాల , యఙ్ఞోపవీతం పలు రకాల పూలు పండ్లతో ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్టలో కొలువైన జంటనాగుల విగ్రహాలకు పూజలు చేశారు.ఆవుపాలతో అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు.
శ్రావణ మాసంలో (Sravanamasam) వచ్చే నాగుల చవితికి స్వామి వారికి పూజలు చేయడంతో నాగ దోషాలు తొలిగిపోతాయని స్థానాచార్యులు పూర్ణానంద తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం వారు సర్పదోశ నివారణ పూజలు ప్రతీ రోజు మూడు విడతలుగా జరుగుతున్నాయని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగ పరుచుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న కోరారు.
సనాతన సాంప్రదాయ కరపత్రం విడుదల
సంసృతీ సాంప్రదాయలను కాపాడుకొవడమే కాకుండా నేటి తరానికి వైదిక కార్యక్రమాలపై యాత్రికులకు అవగాహన కల్పిస్తూ అర్చక పురోహితుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్కు చెందిన సనాతన సాంప్రదాయ ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు బాలాంత్రపు వెంకట రౌద్రి తెలిపారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల సన్నిధిలో కరపత్రాన్ని (Posters) విడుదల చేశారు.
ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులకు కరపత్రాలను అందించి ఇందుకు సంబందించిన వివరాలతో కూడిన మొబైల్ యాప్ గురించి వివరించారు. బ్రాహ్మణ యువకులైన పురోహితులకు వ్యవస్థలో అన్ని వసతులను కల్పిస్తూ ఉపాధిని కల్పించడం, వారి ద్వార వైదిక కార్యక్రమాలు, షోడశ కర్మలపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. అవగాహన శిబిరంలో బాలాంత్రపు శేషు కుమార్ శర్మ, వంగల సురేష్ శర్మలు పాల్గొన్నారు.