Srisailam | శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానానికి రూ. 4,08,69,958 నగదు రాబడి వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఆదాయంలో హుండీల ద్వారా రూ. 3,97,30,582, అన్నప్రసాద వితరణ హుండీల ద్వారా రూ. 11,39,376లు మొత్తం వెరసి రూ 4,08,69,958 ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం గత 35 రోజుల్లో వచ్చిందని తెలిపారు.
ఈ ఏడాది జూన్ 27 నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ హుండీల రాబడిని భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ హుండీలో 639 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 480 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 363- యుఎస్ఏ డాలర్లు, 30 – యు.ఏ.ఈ దిర్హమ్స్ , 1 – కువైట్ దినార్, 5 – సౌదిరియాల్స్ , 1- కత్తార్ రియాల్స్, 62- సింగపూర్ డాలర్లు, 40 – కెనడియన్ డాలర్లు , 20 – ఇంగ్లాడ్ పౌండ్స్ 27 – మలేషియా రింగిట్స్ , 200 – ఓమన్ బైసా, 6,20,000 – కొరియా ఓన్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.