హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీడీవో సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్టు సంఘం నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఈవో ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కమిటీ అధ్యక్షుడిగా టీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జే పద్మావతి, ట్రెజరర్‌గా సయ్యద్ తారీఖ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. సహాధ్యక్షుడిగా కే ధన్సింగ్, ఉపాధ్యక్షులుగా ఎం మోహన్, జీ సంతోశ్, బీ మల్లికార్జున్, ఎన్ భారతి, జాయింట్ సెక్రటరీలుగా టీ బాలరాజురెడ్డి, జీ వాణి, ఎన్ దివ్యదర్శనరావు ఎన్నికయ్యారు.
పబ్లిసిటీ సెక్రటరీగా కే జమలారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే స్వరూప, కే శేషాద్రి, కార్యాలయ సెక్రటరీగా ఏ శ్రీనివాసరెడ్డి, కల్చరల్ సెక్రటరీగా బీ హిమబిందు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా బాబు బేరి వ్యవహరించారు. కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, టీఎంపీడీవోస్ మాజీ అధ్యకుడు సత్తయ్య, 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.