హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీ (డీఆర్డీఎల్) నూతన డైరెక్టర్‌గా జీఏ శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ దశరథ్‌రామ్ మంగళవారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లోని అడ్వాన్స్ నావల్ సిస్టం సైంటిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్‌గా శ్రీనివాసమూర్తి సేవలు అందిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1986లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ పూర్తి చేసిన శ్రీనివాసమూర్తి.. ఓయూలో ఎంఈ చదివారు. 1987లో డీఆర్డీఎల్లో చేరిన ఆయన.. స్ట్రక్చరల్ డైనమిక్స్సహా పలు మిస్సైల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల్లో పనిచేశారు.