హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ జనరల్ (సీఈఐజీ) కార్యాలయంలో 200 ఫైళ్లు పెండింగ్‌లో ఉంచారని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక సీఈఐజీ, రెండు డిప్యూటీ సీఈఐజీ పోస్టులకు నియామకాలు చేపట్టకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో తాము సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రెండు నెలలుగా అపార్ట్మెంట్లు, సోలార్‌ప్లాంట్లు, షాపింగ్‌మాల్స్, పరిశ్రమలకు విద్యుత్తు కనెక్షన్లు జారీకాని పరిస్థితి నెలకొందని వివరించారు. ఇప్పటికైనా సీఈఐజీ, రెండు డిప్యూటీ సీఈఐజీ పోస్టులను భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు.