హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గిరి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్లుగా నవీన్ కుమార్, లావణ్య లత విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా ప్రేమ్(దేవేందర్), అడిషనల్ సెక్రటరీగా భూక్యా రాము, జాయింట్ సెక్రటరీలుగా పీ రాజేశ్వర్, యామిని కనకతార, వంశీధర్‌రెడ్డి, నీరజాక్షి, కే శ్రీనివాసరెడ్డి గెలుపొందారు.
10న బీసీ మేధావుల సమావేశం
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10న హైదరాబాద్ హరిత ప్లాజాలో బీసీ మేధావుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.