హైదరాబాద్, తెలుగు యూనివర్సిటీ జూలై 7(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి తన మొండి వైఖరి వీడి పెండింగ్‌లోని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఫీజు రీయింబర్స్మెంట్ జాప్యంపై నల్లకండువాలను ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మాట్లాడారు. కమిటీలు, జీవోల పేరిట కావాలనే సీఎం రేవంత్‌రెడ్డి కాలయాపన చేస్తున్నారని మం డిపడ్డారు. ఫీజుల వసూలు కోసం విద్యార్థులపై రికవరీ యాక్ట్‌ను ప్రయోగిస్తామనడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించి పరిషరించాలని, లేకుంటే విద్యార్థి, నిరుద్యోగ, సామాజిక సంఘాలను కలుపుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హ్చెరించారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. ఫీజులు సకాలంలో అందక కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై ఈనెల 14న చలో కలెక్టరేట్‌ను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ జేఏసీ నాయకుడు గుజ్జ కృష్ణ, సురేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.