హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ): జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 21న జనగామలో భారీ నిరసనదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని నీరాకేఫ్‌లో ‘చలో జనగామ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ పేరు పెట్టాలని గీతకార్మిక, గౌడ సంఘాలు తీర్మానించి, ఆందోళనలు చేస్తున్నాయని తెలిపారు. ఈ నెల 21న దీక్ష తర్వాత ఉద్యమ కార్యచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, నందనం నీరా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, కార్మికులకు సేఫ్టీ మోకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మద్యం దుకాణాల్లో గౌడ్లకు 25శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో నీరా కేఫ్‌లను తీసుకురావడంతో పాటు ‘నీరా కార్పొరేషన్’ ఏర్పాటు చేసి గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు. దీక్షను విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. గౌడన్నలందరూ ‘చలో జనగామ’కు తరలిరావాలని సమన్వయ కమిటీ సభాధ్యక్షుడు సదానందంగౌడ్ తెలిపారు. సమావేశంలో గౌడ, కల్లుగీత సంఘాల నాయకులు ఏడుకొండలుగౌడ్, ఈశ్వరయ్యగౌడ్, సోమన్నగౌడ్, కృష్ణగౌడ్, మురారీగౌడ్, మల్లేశం గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, మహేందర్‌గౌడ్, భూపతిగౌడ్, ఆంజనేయులుగౌడ్, రాజకుమార్‌గౌడ్, సత్యంగౌడ్, సిద్ధిరాములుగౌడ్, వెంకటనర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.